Hamid Ansari : మ‌న కాలంలో రాజీవ్ గొప్ప నేత

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి హ‌మీద్ అన్సారీ

Hamid Ansari : భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి మ‌హ‌మ్మ‌ద్ హ‌మీద్ అన్సారీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న దివంగ‌త మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీని స్మ‌రించుకున్నారు. మ‌న కాలంలో సంచ‌రించిన గొప్ప నాయ‌కుడు అని కితాబు ఇచ్చారు. యువ‌కుడిగా దేశాన్ని న‌డిపించిన వ్య‌క్తి రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. ఆయ‌న జీవించింది స్వ‌ల్ప కాల‌మే అయినా జీవితంలో తాకిన ప్ర‌తి దానిపై త‌న వ్య‌క్తిత్వం ముద్ర‌ను వ‌దిలి వెళ్లారంటూ ప్ర‌శ‌సించారు హ‌మీద్ అన్సారీ.

Hamid Ansari Tribute to Rajiv Gandhi

ఆయ‌న బ‌ల‌మైన , స్వ‌తంత్ర , స్వావ‌లంబ‌న కోసం పాకులాడాడు. ఆయ‌న నిత్యం ఈ దేశం బాగుండాల‌ని కోరుకున్నాడు. ప్ర‌పంచ దేశాల‌లో అగ్ర‌గామిగా భార‌త్ ఉండాల‌ని గొప్ప‌గా క‌ల‌లు క‌న్నాడ‌ని కొనియాడారు హమీద్ అన్సారీ(Hamid Ansari). ఈ దేశానికి టెక్నాల‌జీ, టెలికాం రంగాల‌ను ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త రాజీవ్ గాంధీకే ద‌క్కింద‌ని స్ప‌ష్టం చేశారు ఉప రాష్ట్రప‌తి. ఇంకా ప‌ది కాలాల పాటు బ‌త‌కాల్సిన వ్య‌క్తి అని పేర్కొన్నారు. గొప్ప విజ‌న్ ఉన్న నాయ‌కుడు రాజీవ్ గాంధీ అని ప్ర‌శంసించారు. ఆయ‌న‌తో తాను గ‌డిపిన క్ష‌ణాల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ దేశ భ‌విష్య‌త్తు అంతా యువ‌త‌పైనే కేంద్రీకృత‌మైంద‌ని ఆయ‌న గుర్తించారు. అందుకే వ‌న‌రులు ఏమేం ఉన్నాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే స‌మ‌యంలో దేశం బాగు కోసం ప‌రిత‌పించిన ఏకైక నాయ‌కుడు రాజీవ్ గాంధీ అని ప్ర‌శంసించారు.

Also Read : Spain Create Win : ఫిఫా వ‌రల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ స్పెయిన్

Leave A Reply

Your Email Id will not be published!