Patnam Mahender Reddy : ముహూర్తం ఫిక్స్ ఇంకా సస్పెన్స్
ఇంకా ఖరారు కానీ ముహూర్తం
Patnam Mahender Reddy : గవర్నర్ వర్సెస్ సీఎం మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతుందా. ఇదే అనుమానం వ్యక్తం అవుతోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు.
చివరి దాకా టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి తీపి కబురు చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, నీకు కచ్చితంగా సీటు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయం నుండి నోట్ కూడా వచ్చింది.
Patnam Mahender Reddy Waiting for Governer Appointment
బుధవారం పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ పేర్కొంది. పట్నం ఫుల్ ఖుష్ లో ఉండగా ఉన్నట్టుండి తమకు ఎలాంటి సమాచారం లేదని గవర్నర్ కార్యాలయం తెలిపింది. దీంతో పట్నం ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అన్నది సస్పెన్ష్ గా మారింది.
కాగా మంత్రిగా ప్రమాణం చేయాలంటే విధిగా రాజ్ భవన్ వేదికగా గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. లేక పోతే దానికి విలువ ఉండదు. దీంతో గవర్నర్ చూపు తమ మీద పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. కాగా తమిళిసైకి పంటి నొప్పి ఉండడం కారణంగా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉండక పోవచ్చని సమాచారం.
ఏది ఏమైనా రేపైనా పట్నం మహేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా వేచి చూడాలి.
Also Read : Revanth Reddy : రుణాలు తెచ్చుకోండి మాఫీ చేస్తా