PM Modi : ద‌క్షిణాఫ్రికాతో బ‌ల‌మైన బంధం – మోదీ

ఇరు దేశాల మ‌ధ్య ఒప్పందాలు

PM Modi : బార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఆ దేశ అధ్య‌క్షుడు సిరిల్ రామఫోసా తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం ఇరు దేశాల అధినేత‌లు సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ప్ర‌ధానంగా ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు భార‌త్ – ద‌క్షిణాఫ్రికా క‌లిసి క‌ట్టుగా పోరాడాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

PM Modi Meet Mr. Cyril Ramaphosa

ఇదే స‌మ‌యంలో గ‌త కొన్నేళ్లుగా ఇరు దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు ఉన్నాయ‌ని, వాటిని మ‌రింత పెంపొందించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూత్ర‌ప్రాయంగా అంగీక‌రాం తెలిపాయి. అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా వాణిజ్యం, ర‌క్ష‌ణ‌, పెట్టుబ‌డి అనుసంధానాలు చ‌ర్చ‌ల‌లో ప్ర‌ముఖంగా వ‌చ్చాయ‌ని స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(Prime Minister Modi) వెల్ల‌డించారు. గ్లోబ‌ల్ సౌత్ వాయిస్ ను బ‌లోపేతం చేసేందుకు తాము క‌లిసి ప‌ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Nara Lokesh : మంగ‌ళ‌గిరిలో గెలుస్తా కానుక‌గా ఇస్తా

Leave A Reply

Your Email Id will not be published!