Telangana Judge Suspend : మంత్రికి ఊరట జడ్జి సస్పెండ్
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
Telangana Judge Suspend : తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయ కుమార్ ను సస్పెండ్ చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం.
Telangana Judge Suspend Viral
ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ట్యాంపర్ చేశారన్న కేసులో జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు.
శ్రీనివాస్‌గౌడ్ సహా మరో 10 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసులకు జడ్జి ఆదేశించారు.
ఈ పది మందిలో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కూడా కేసు పెట్టాలని గతంలో జయకుమార్ ఆదేశించారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని జయకుమార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది.
దీంతో జడ్జిని సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్పు కలకలం రేపింది. మంత్రి, ఉన్నతాధికారుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
Also Read : Chandrayan-3 : జాబిల్లి చెంతకు చంద్రయాన్ -3