RK Roja Selvamani : ఇండియా కంటే భార‌త్ బెట‌ర్

మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి

RK Roja Selvamani : తాడేప‌ల్లి గూడెం – ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి(RK Roja Selvamani) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ తాజాగా ఇండియా స్థానంలో భార‌త్ పేరు చేర్చ‌డంపై స్పందించారు. ఇండియా పేరును భార‌త్ గా మార్చ‌డంలో త‌ప్పేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల వ‌చ్చే న‌ష్టం ఏమీ త‌న‌కు క‌నిపించ‌డం లేద‌ని పేర్కొన్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

RK Roja Selvamani Said

మోదీ ప్ర‌భుత్వానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలుపుతూ వ‌స్తోంది ఏపీ వైసీపీ స‌ర్కార్. స‌ద‌రు స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా గుడ్డిగా స‌పోర్ట్ చేయ‌ని ప‌రిస్థితి. మ‌రో వైపు భార‌త్ గా మార్చ‌డాన్ని ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మి తీవ్రంగా అభ్యంత‌రం తెలిపింది. ఇది పూర్తిగా త‌మ కూట‌మికి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌య‌త్నం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది.

దేశంలో ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెచ్చ‌రిల్లి పోతోంద‌ని , ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్నార‌ని కానీ వాటిపై ఫోక‌స్ పెట్టాల్సిన మోదీ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఆరోపించింది. మొత్తంగా ఆర్కే రోజా చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!