India Big Shock : మోడీ మీడియాకు ఇండియా షాక్

తాము స‌పోర్ట్ చేయ‌మ‌న్న నేత‌లు

India Big Shock : భార‌త దేశంలో కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కు వంత పాడుతున్న ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, డిజిట‌ల్ మీడియాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మి(India Big Shock).

శ‌నివారం ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఘోడీ మీడియాను తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశాయి. గుడ్డిగా బీజేపీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను స‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క ప‌త్రిక‌, ఛాన‌ల్, డిజిట‌ల్ మీడియాను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎంలు.

India Big Shock to Opposite Media Channels

ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఢిల్లీ, పంజాబ్ లోని ఆప్ స‌ర్కార్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ , క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సీఎంలు ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

బీహార్ లోని నితీష్ కుమార్, త‌మిళనాడులోని డీఎంకే ప్ర‌భుత్వంలో, కేర‌ళ లోని సీపీఎం స‌ర్కార్ , ప‌శ్చిమ బెంగాల్ లోని టీఎంసీ ప్ర‌భుత్వం, జార్ఖండ్ లో కొలువు తీరిన సీఎం హేమంత్ సోరేన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

తాము ఆహ్వానించినా త‌మ పార్టీల‌కు చెందిన అధికార ప్ర‌తినిధులు కానీ ఇతర సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రూ పాల్గొన‌ర‌ని స్ప‌ష్టం చేశారు ఆయా రాష్ట్రాల సీఎంలు. ఇది దేశ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించింది. మొత్తంగా ఒక ర‌కంగా మీడియా ప‌క్ష పాత ధోర‌ణి నుంచి బ‌య‌ట ప‌డాల‌ని పేర్కొన్నారు.

Also Read : Sonia Gandhi : సోనియా..రాహుల్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!