Ramya Krishnan : రోజాకు రమ్యకృష్ణ మద్దతు
బండారు కామెంట్స్ బాధాకరం
Ramya Krishnan : ప్రముఖ నటి రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణికి మద్దతు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా నటి స్పందించారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ చౌదరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ramya Krishnan Slams Bandaru Satyanarayana
ఒక బాధ్యత కలిగిన మంత్రిగా పని చేసిన బండారు ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమాజం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు. తాను ఆర్కే రోజాకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
వెంటనే నాన్ బెయిలబుల్ కింద బండారు సత్య నారాయణ చౌదరిని అరెస్ట్ చేయాలని రమ్యకృష్ణ(Ramya Krishnan) డిమాండ్ చేశారు. మంత్రి రోజా సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా రోజాకు నటీనటులు మద్దతు ప్రకటించారు.
మంత్రికి సంఘీభావం తెలిపిన వారిలో ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ , మీనా ఉన్నారు. మరో వైపు రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్య నారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆదేశించారు. ఈ మేరకు భారీ భద్రత మధ్య బండారును అరెస్ట్ చేశారు. బెయిల్ తో బయటకు వచ్చారు.
Also Read : CM KCR : సీఎం కేసీఆర్ ఖుష్ కబర్