Revanth Reddy : మెట్రో అధికారుల‌పై రేవంత్ గుస్సా

వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మేన‌ని ప్ర‌క‌ట‌న

Revanth Reddy : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మెట్రో అధికారుల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాబోయేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని పేర్కొన్నారు.

Revanth Reddy Serious Comments

హైద‌రాబాద్ లో హోర్డింగ్స్ పెట్టుకునేందుకు, మెట్రో రైలు లో ప్ర‌చారం చేసుకునేందుకు త‌మ పార్టీకి స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వాలని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.

డిసెంబ‌ర్ 3 త‌ర్వాత వ‌చ్చేది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని జోష్యం చెప్పారు. కేవ‌లం అధికార పార్టీకి వంత పాడుతూ ప్ర‌క‌ట‌న‌లు ఏర్పాటు అయ్యేలా అనుమ‌తి ఇస్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు ఎనుముల రేవంత్ రెడ్డి.

అన్ని పార్టీల‌తో పాటు త‌మ పార్టీకి కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకునే హ‌క్కు ఉంటుంద‌న్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తామంటే ఊరుకోమ‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది సేవ‌లు చేసేందుక‌ని కానీ అందుకు విరుద్దంగా ఉంటే ఊరుకోమ‌న్నారు టీపీసీసీ చీఫ్‌.

Also Read : AP CID : ఐఆర్ఆర్ కేసులో నారాయ‌ణ అల్లుడు

Leave A Reply

Your Email Id will not be published!