CM KCR Visit : ఎంపీకి ప‌రామ‌ర్శ గ‌న్ మెన్ కు ప్ర‌శంస‌

హ‌త్యా రాజ‌కీయాలు మంచి ప‌ద్ద‌తి కాదు

CM KCR Visit : హైద‌రాబాద్ – ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పాల్గొన్న ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై రాజు అనే వ్య‌క్తి క‌త్తితో పొడిచాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలిసిన వెంట‌నే ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు య‌శోద కు చేరుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స‌లు అందించాల‌ని ఆదేశించారు.

CM KCR Visit Yashoda Hospital

ఈ సంద‌ర్బంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీఎం కేసీఆర్(CM KCR) చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిని ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.

ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని క‌త్తితో దాడి చేసిన యువ‌కుడి నుండి ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నం చేశారు గ‌న్ మెన్. అత‌డి వేలికి కూడా గాయ‌మైంది. దీంతో అత‌డి గాయాన్ని చూశారు సీఎం కేసీఆర్. అంగ రక్ష‌కుడి ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంసించారు సీఎం కేసీఆర్.

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై దాడి జ‌ర‌గ‌డాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె ప్ర‌స్తుతం ఆక్స్ ఫ‌ర్డ్ లో ప్ర‌సంగించేందుకు గాను లండ‌న్ కు చేరుకున్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే తీవ్రంగా స్పందించారు. రాజ‌కీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడుల‌కు దిగ‌డం స‌రికాద‌న్నారు .

Also Read : CM KCR : తెలంగాణ అభివృద్దికి న‌మూనా

Leave A Reply

Your Email Id will not be published!