Pawan Kalyan : బాబు అనుభ‌వం రాష్ట్రానికి అవ‌స‌రం

మ‌ధ్యంత‌ర బెయిల్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు రాష్ట్ర హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు వెసులుబాటు ఇస్తూ తీర్పు చెప్పారు జ‌డ్జి.

Pawan Kalyan Comment about Babu Bail

ఇందులో భాగంగా ప‌లు కండీష‌న్స్ పెట్టారు. అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. ఎలాంటి రాజ‌కీయ స‌భ‌ల‌లో పాల్గొన కూడ‌దు. కేవ‌లం అనారోగ్యం రీత్యా చికిత్స కోసం వెళ్ల‌వ‌చ్చు. కంటి ఆప‌రేష‌న్ చేయించు కోవ‌చ్చు. త‌న‌కు ఇష్ట‌మైన ఆస్ప‌త్రిలో ఎక్క‌డైనా చూయించు కోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఇది తుది తీర్పు మాత్రం కాద‌ని పేర్కొంది కోర్టు.

ఏపీ స్కిల్ స్కాం కేసులో రూ. 371 కోట్లు కొల్ల‌గొట్టాడ‌ని, తాను సీఎంగా ఉన్న‌ప్పుడు త‌న అనుచ‌రులు, అనుయాయుల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌య‌త్నం చేశారంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేర‌కు ఏసీబీ కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించింది.

ఈ ఒక్క కేసు మాత్ర‌మే కాకుండా మ‌రో రెండు కేసులు న‌మోదు చేసింది. ఈ సంద‌ర్బంగా వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ఇట‌లీలో జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి త‌న మూడో భార్యతో క‌లిసి వెళ్లారు. విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని కోరారు.

Also Read : Daggubati Purandeswari : బాబు రాక పురందేశ్వ‌రి కేక

Leave A Reply

Your Email Id will not be published!