Trans Gender Ticket : ట్రాన్స్ జెండ‌ర్ కు బీఎస్పీ టికెట్

చ‌రిత్ర సృష్టించిన బ‌హుజ‌న పార్టీ

Trans Gender Ticket : తెలంగాణ – తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా పార్టీలు ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఈసారి ఎలాగైనా స‌రే నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సార‌థ్యంలోని బీఎస్పీ కంక‌ణం క‌ట్టుకుంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌లు, స‌మావేశాలు, పాద‌యాత్రలు చేప‌ట్టారు ఆ పార్టీ చీఫ్‌, మాజీ ఐపీఎస్.

Trans Gender Ticket in Telangana

మొత్తం 119 సీట్ల‌కు గాను రెండో జాబితాను బీఎస్పీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు బీఎస్పీ చీఫ్ . ఏ పార్టీలు చేయ‌ని విధంగా మొద‌టిసారిగా ట్రాన్స్ జెండ‌ర్ ను పోటీలో నిల‌బెట్టారు. దీని ద్వారా అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించిన పార్టీగా బీఎస్పీ నిలిచి పోయింది. ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి అని ఆ పార్టీ పేర్కొంది.

ఆ పార్టీ త‌ర‌పున మొద‌టిసారి అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు బీఎస్పీ బాస్ డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అభ్య‌ర్థిగా 29 ఏళ్ల చిత్ర‌పు పుష్పితా ల‌య‌ను ఎంపిక చేసింది.

ఇదిలా ఉండ‌గా ఆర్ఎస్పీ(RSP) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ తో పాటు ఫామ్ హౌస్ ను కూడా జాతీయం చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల డ‌బ్బుల‌తో ప‌వ‌ర్ ను ఎంజాయ్ చేస్తున్న క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి కాలం చెల్లింద‌ని పేర్కొన్నారు.

Also Read : Tirumala Hundi : భారీగా శ్రీ‌వారి హుండీ ఆదాయం

Leave A Reply

Your Email Id will not be published!