Revanth Reddy : కేసీఆర్ కుటుంబం తిన్న‌దంతా క‌క్కిస్తం

టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియాక‌మాల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ దోపిడీకి కేరాఫ్ గా మార్చేశారంటూ ఆరోపించారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా భేరి పేరుతో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంపాదించిన కోట్ల‌న్నింటిని బ‌రా బ‌ర్ క‌క్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Revanth Reddy Slams BRS Party

తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌క్ష‌ణ‌మే క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని జైలులో వేస్తామ‌న్నారు. తిన్న‌దంతా వ‌సూలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రజల తెలంగాణ కావాలా లేక దొర‌ల తెలంగాణా కావాలో తేల్చు కోవాల‌న్నారు.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, నాలుగున్న‌ర కోట్ల మంది మూకుమ్మ‌డిగా గులాబీని కోరుకోవ‌డం లేద‌న్నారు. త‌మ‌పై తామే దాడులు చేసుకుంటూ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. త‌మ పార్టీ ఇప్ప‌టికే ఆరు గ్యారెంటీ హామీల‌ను త‌ప్ప‌క అమ‌లు చేస్తామ‌ని ప్ర‌కటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో సామాన్యులు, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త బీఆర్ఎస్ స‌ర్కార్ కే ద‌క్కుతుంద‌న్నారు.

Also Read : Rahul Gandhi : దొర‌ల‌ రాజ్యం దొంగ‌ల‌ పెత్త‌నం

Leave A Reply

Your Email Id will not be published!