Rahul Dravid : కొన‌సాగిస్తారా ప‌క్క‌న పెడ‌తారా

బీసీసీఐ నిర్ణ‌యంపై ఉత్కంఠ

Rahul Dravid : వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క‌థ ముగిసింది. టి20 మ్యాచ్ సీరీస్ కూడా మొద‌లైంది. భార‌త్ తొలి వ‌న్డేలో దుమ్ము రేపింది. కానీ ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగిస్తోంది కోచ్ రాహుల్ ద్ర‌విడ్ విష‌యంలో. కార‌ణం హెడ్ కోచ్ గా ఆయ‌న ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. మ‌రో వైపు హైద‌రాబాద్ కు చెందిన వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే గ‌తంలో ర‌వి శాస్త్రి ఉన్నా గంగూలీ దెబ్బ‌కు త‌ను త‌ప్పుకున్నాడు.

Rahul Dravid Position

ఆయ‌న స్థానంలో ద్ర‌విడ్ ను తీసుకున్నాడు దాదా. త‌ను బెంగ‌ళూరులోని క్రికెట్ అకాడెమీకి డైరెక్ట‌ర్ గా ఉంటూ వ‌చ్చాడు. మెరిక‌ల్లాంటి కుర్రాల‌ను త‌యారు చేశాడు. వాళ్లంతా ఇప్పుడు కీల‌క‌మైన ఆట‌గాళ్లుగా మారారు. మ‌రో వైపు కోచ్ అయ్యాక కొన్ని విజయాలు మ‌రికొన్ని వైఫ‌ల్యాలు ఉన్నాయి.

టీమిండియాను ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ దాకా భార‌త జ‌ట్టును తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యాడు రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid). కానీ బీసీసీఐ త‌న కాంట్రాక్ట్ ను కంటిన్యూ చేస్తుందా లేక పొమ్మ‌న‌కుండా పొగ పెడుతుందా అన్న‌ది వేచి చూడాలి.

అయితే గ‌తంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కోచ్ గా ఉన్నాడు. త‌న కాంట్రాక్టు అయి పోగానే ఏదో ఒక ఐపీఎల్ జ‌ట్టుకు మెంటార్ గా వెళ్లే ఛాన్స్ లేక పోలేద‌ని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా రాహుల్ ద్ర‌విడ్ కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతుందా లేక ల‌క్ష్మ‌ణ్ కు అప్ప‌గిస్తుందా అన్న‌ది వెయిటింగ్ .

Also Read : N Raghuveera Reddy : అంత‌టా కాంగ్రెస్ గాలి వీస్తోంది

Leave A Reply

Your Email Id will not be published!