N Raghuveera Reddy : అంత‌టా కాంగ్రెస్ గాలి వీస్తోంది

నీల‌కంఠాపురం ర‌ఘు వీరా రెడ్డి

N Raghuveera Reddy : అనంత‌పురం జిల్లా – మాజీ మంత్రి, మాజీ ఏపీపీసీసీ చీఫ్ నీల‌కంఠాపురం ర‌ఘువీరా రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌కు అందిన స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, స్ప‌ష్ట‌మైన తీర్పు ఇవ్వ‌బోతున్నార‌ని పేర్కొన్నారు.

N Raghuveera Reddy Comment

ప్ర‌తి చోటా కాంగ్రెస్ పార్టీకి అనూహ్య‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని చెప్పారు. తెలంగాణ తో స‌హా ప్ర‌స్తుతం దేశంలోని మ‌ణిపూర్, రాజ‌స్థాన్, మ‌ధ్య ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌తి చోటా హ‌స్తం వైపు గాలి మ‌ల్లింద‌ని , ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని పేర్కొన్నారు.

మాయ మాట‌లు చెబుతున్న వాళ్ల‌కు కాలం చెల్లింద‌న్నారు నీల‌కంఠాపురం ర‌ఘువీరా రెడ్డి(N Raghuveera Reddy). ఈ ఐదు రాష్ట్రాల‌లో త‌మ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎక్క‌డ చూసినా సోనియా గాంధీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలోని ఖ‌ర్గే సార‌థ్యంలోని పార్టీ మ‌రింత ముందుకు వెళుతోంద‌న్నారు.

ఇవాళ తెలంగాణ‌లో పార్టీకి పూర్వ వైభవం సంత‌రించుకుంద‌ని దీనిని ఆపే శ‌క్తి ఏ పార్టీకి లేద‌న్నారు నీలకంఠాపురం ర‌ఘువీరారెడ్డి.

Also Read : PM Modi : క‌మ‌లం వైపు జ‌నం చూపు

Leave A Reply

Your Email Id will not be published!