Malla Reddy Case : మల్లన్నకు షాక్ కేసు నమోదు
తప్పుడు ఎన్నికల అఫిడవిట్
Malla Reddy Case : హైదరాబాద్ – పూలమ్మిన, కూరగాయలు అమ్మిన అంటూ పదే పదే చెప్పే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు. అఫిడవిట్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి(Malla Reddy) నమోదు చేసిన వివరాలు పూర్తిగా తప్పుగా ఉన్నాయని, ప్రతి చోట ఎక్కడికి వెళ్లినా తాను కోట్ల రూపాయలు సంపాదించానంటూ పదే పదే చెప్పడాన్ని కూడా ప్రస్తావించారు.
Malla Reddy Case Viral
పూర్తిగా తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేశాడంటూ పిటిషనర్ కందాడి అంజిరెడ్డి ఆరోపించారు. తప్పుడు అఫిడవిట్ ప స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వెంటనే స్పందించింది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆర్టీఐ కింద సమాచారం కావాలని కోరినా పట్టించు కోలేదని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి సమాచారం ఇవ్వక పోవడం నేరమేనని పేర్కొన్నారు. అత్యవసరంగా కేసును విచారించాలని పిటిషనర్ కోరారు. దీనిపై సుప్రీంకోర్టు వెంటనే స్పందించింది. ఈనెల 30 లోపే కేసును విచారిస్తేనే న్యాయం జరుగుతుందని పిటిషనర్ కోరారు.
మంత్రిగా పని చేసేందుకు అనర్హుడంటూ ఆరోపించారు పిటిషనర్. కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించిన అన్ని తప్పులే ఉన్నానని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రాన్ని ఈ తప్పుల తడకతో ఉన్న మల్లారెడ్డి నుంచి రక్షించాలని కోరారు సుప్రీంను.
Also Read : Rahul Dravid : కొనసాగిస్తారా పక్కన పెడతారా
