Revanth Reddy : సోనియ‌మ్మ‌కు రేవంత్ ఆహ్వానం

ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని విన్న‌పం

Revanth Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి నూత‌న సీఎంగా నియ‌మితులైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తిన‌లో బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ 7న గురువారం నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈమేర‌కు రాష్ట్ర స‌ర్కార్ కు చెందిన ఉన్న‌తాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Revanth Reddy Invites Sonia Gandhi

ఇందులో భాగంగా పార్టీకి సంబంధించిన పెద్ద‌ల‌ను క‌లుసుకుని ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రావాల‌ని ఆహ్వానం ప‌లుకుతున్నారు రేవంత్ రెడ్డి. నిన్న కొంద‌రిని క‌లుసుకోగా బుధ‌వారం మ‌రికొంద‌రితో భేటీ అయ్యారు.

మొద‌ట నేరుగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే వ‌ద్ద‌కు వెళ్లారు. ఆయ‌న నివాసంలో పుష్ప‌గుచ్ఛం ఇచ్చి రావాల‌ని ఆహ్వానించారు. అక్క‌డి నుంచి సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీని క‌లుసుకున్నారు.

త‌న‌కు సీఎంగా ప‌ని చేసేందుకు అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు అనుముల రేవంత్ రెడ్డి.

Also Read : Heavy Rains AP : వ‌ర్ష బీభ‌త్సం రైతులు ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!