AP CM YS Jagan : తుఫాను తీవ్ర‌త‌పై జ‌గ‌న్ స‌మీక్ష‌

కుండ పోత గుండె కోత

AP CM YS Jagan : అమ‌రావ‌తి – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న తుఫాను దెబ్బ‌కు ఏపీ రాష్ట్రంలో ప‌లు ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. భారీ ఎత్తున పంట‌లు నేల‌కొరిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బ తిన్నాయి. మిచౌంగ్ తుఫాన్ కార‌ణంగా త‌మిళ‌నాడు పూర్తిగా దెబ్బ‌తింది. దీంతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

AP CM YS Jagan Investigation for Cyclone

దీంతో తుఫాను తీవ్రత గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా సీఎం బుధ‌వారం తాడేప‌ల్లిగూడెం లోని స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని భ‌రోసా ఇచ్చారు సీఎం.

రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). బాధితుల‌కు రూ. 10 వేలు త‌క్ష‌ణ సాయంగా అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎంత న‌ష్టం వాటిల్లినా స‌రే ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

రేష‌న్ పంపిణీలో ఎలాంటి లోపం ఉండ కూడ‌ద‌ని సూచించారు. పంట‌ల ర‌క్ష‌ణ‌, త‌డిసిన , రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామ‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. వాలంటీర్ల ద‌గ్గ‌ర నుంచి పై స్థాయి ఉద్యోగుల వ‌ర‌కు ఈ స‌ర్కార్ తోడుగా నిలుస్తంద‌న్నారు.

Also Read : Revanth Reddy : ప్ర‌మాణ స్వీకారం ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!