Komatireddy Venkat Reddy : సోదరా కంగ్రాట్స్ – కోమటిరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి అభినందన
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లా – తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నాక రేవంత్ హస్తినకు పయనమయ్యారు. అక్కడ ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణు గోపాల్ ను కలుసుకున్నారు. పార్లమెంట్ కు వెళ్లారు.
Komatireddy Venkat Reddy Praises Revanth Reddy
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చివరి దాకా సీఎం రేసులో నిలిచిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
శాసన సభా పక్ష నేతగా, సీఎంగా ఎంపిక కావడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు . అంతే కాకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే చక్రవర్తిని గద్దె దించి తెలంగాణలో ప్రజాస్వామిక పాలన తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశాడని కొనియాడారు. ఇందులో అందరి పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
ఇదే సమయంలో తమకు భారీ మెజారిటీ కట్ట బెట్టినందుకు , ఓట్లు వేసి గెలిపించినందుకు నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : AP CM YS Jagan : తుఫాను తీవ్రతపై జగన్ సమీక్ష
