DK Shiva Kumar : కేబినెట్ పై హైక‌మాండ్ దే ఫైన‌ల్

డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

DK Shiva Kumar : ఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నూత‌న సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొలువు తీరారు. ఏఐసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మ‌కాం వేశారు పార్టీ ప‌రిశీల‌కుడు, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.

DK Shiva Kumar Comment

హైద‌రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ శాస‌న స‌భా ప‌క్ష నేత‌గా ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల‌లో అత్య‌ధికంగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సూచించార‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏకవాక్య తీర్మానాన్ని ఏఐసీసీకి విన్న‌వించారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar) , రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ , మాజీ హోం మంత్రి మాణిక్ రావు ఠాక్రే.

నివేదిక అందుకున్న వెంట‌నే కీల‌క భేటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్య‌ర్థిగా రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో కేబినెట్ లో ఎవ‌రు మంత్రులుగా ఉంటార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేస్తోంది హైక‌మాండ్.

ఈ త‌రుణంలో నిన్న‌టి దాకా ఢిల్లోలో ఉన్న డీకే శివ‌కుమార్ ఇవాళ బెంగ‌ళూరుకు బ‌య‌లుదేరి వెళ్లారు. 7న గురువారం జ‌రిగే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఈ సంద‌ర్భంగా డీకే మీడియాతో మాట్ల‌డారు. మంత్రివ‌ర్గంపై పార్టీ హైక‌మాండ్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు ఇస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం.

Also Read : Komatireddy Venkat Reddy : సోద‌రా కంగ్రాట్స్ – కోమ‌టిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!