K Narayana Swamy : కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబురాలా
ఎద్దేవా చేసిన డిప్యూటీ సీఎం స్వామి
K Narayana Swamy : తిరుపతి – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంబురాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి పార్టీకి కొన్ని పద్దతులు ఉంటాయని , కానీ టీడీపీకి , జనసేన పార్టీకి అవి వర్తించవని మండిపడ్డారు.
K Narayana Swamy Shocking Comments
ఎవరైనా రాజకీయాలలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అనుకుంటారని కానీ టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే తాను నిఖార్సైన కాంగ్రెస్ వాదినంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. కేసీఆర్ ను ఓడించేందుకు కులాలను, మతాలను రెచ్చ గొట్టారంటూ ఆరోపించారు.
హైదరరాబాద్ లో, దాని చుట్టు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవ లేదన్నారు నారాయణ స్వామి(K Narayana Swamy). పెద్ద ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేసినా షెటిలర్స్ గంప గుత్తగా భారత రాష్ట్ర సమితి పార్టీకి వేశారని , వారికి అక్కడే సీట్లు ఎక్కువగా వచ్చాయని అన్నారు.
లోకేష్ నిరాదారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు నారాయణ స్వామి.
Also Read : Kodandaram : నియంత పాలన పోయింది