Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో శ్రీరాముడి పాలన
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : ఖమ్మం జిల్లా – తెలంగాణ రాక్షస పాలనకు తెర పడిందని ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో శ్రీరాముడి పాలన సాగుతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రాష్ట్రంలో నూతన మంత్రిగా కొలువు తీరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భద్రాచలంలో కొలువు తీరిన సీతా రామ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జిల్లాలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. వేలాది మంది జనం ఆదరించారు.
Ponguleti Srinivas Reddy Comment
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు సీతా రామ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ తో పాటు పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) మీడియాతో మాట్లాడారు. భద్రాచల రాముల వారి ఆశీర్వాదంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి శ్రీరాముడిని సందర్శించు కోవడం గొప్ప అనుభూతి మిగిల్చిందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అప్పుల కుప్పగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని చెప్పారు.
Also Read : Kishan Reddy : అక్రమార్కులకు కేరాఫ్ కాంగ్రెస్