Damodara Raja Narasmha : మహిళా సాధికారతకు ప్రాధాన్యత
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
Damodara Raja Narasmha : హైదరాబాద్ – సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం అమలు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఛాన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మంత్రి మహిళలతో కలిసి బస్సు లో ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా దామోదర రాజ నరసింహ మీడియాతో మాట్లాడారు.
Damodara Raja Narasmha Comment
తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మంత్రి. మరో వైపు ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో 2 హామీలను అమలు చేశామని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు దామోదర రాజ నరసింహ(Damodara Raja Narasmha). తమ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మహిళలను మహరాణులు చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు . పూర్తి పారదర్శకతతో పాలన సాగుతుందని చెప్పారు. ఎవరైనా సరే ప్రజలకు సేవకులమని గుర్తు పెట్టు కోవాలన్నారు ఆరోగ్య మంత్రి.
Also Read : Kamareddy Mla : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా