Jana Reddy : హైకమాండ్ చెబితే ఆలోచిస్తా
కొత్త సర్కార్ కు సలహాలు ఇస్తా
Jana Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కందూరు జానా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన నివాసానికి స్వయంగా వచ్చి కలిశారు కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి. జానారెడ్డి(Jana Reddy) దంపతులతో ముచ్చటించారు.
Jana Reddy Comment
ఈ సందర్భంగా జానా రెడ్డి రేవంత్ ను అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను పార్లమెంట్ కు వెళతానని చెప్పానని, ఒకవేళ పార్టీ హై కమాండ్ కాదని ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే తిరిగి పునరాలోచిస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు జానారెడ్డి.
అయితే ఇదే సమయంలో తనను రేవంత్ రెడ్డి కొన్ని కోరికలు కోరారని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి సహకారం అందించాలని విన్నవించారని, తాను ఆలోచించి చెబుతానని అన్నారు. ఇబ్బందులను, బాధలను తెలియ చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు కందూరు జానా రెడ్డి.
ప్రజల అభిమానం చూరగొనేలా పాలన సాగించాలని, అప్పుడే జనం మనల్ని ఆదరిస్తారని రేవంత్ రెడ్డికి చెప్పానని తెలిపారు మాజీ మంత్రి. మీరు అనుకుంటున్నట్లు ప్రభుత్వంలో తన పాత్ర అంటూ ఏమీ ఉండదన్నారు. సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తానని అన్నారు.
నేను గతంలో పార్లమెంట్ కు పోటీ చేస్తానని చెప్పానని, ఒకవేళ హైకమాండ్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే గనుక తాను అప్పుడు చెబుతానంటూ దాట వేసే ప్రయత్నం చేశారు కందూరు జానా రెడ్డి.
Also Read : Nara Lokesh : లోకేష్ 3,000 కిలోమీటర్లు పూర్తి