Rahul Gandhi : మోదీ నిర్వాకం దాడుల‌కు కార‌ణం

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోదీ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో కొంద‌రు వ్య‌క్తులు దూసుకు వ‌చ్చారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం నిరుద్యోగులు కాద‌ని వారికి జాబ్స్ క్రియేట్ చేయ‌లేని మోదీపై ఉంద‌న్నారు .

Rahul Gandhi Comments on PM Modi

పార్ల‌మెంట్ లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌కు కూడా నిరుద్యోగం మ‌రో కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన న‌రేంద్ర మోదీ ఆ మాట‌ను ఏనాడో మ‌రిచి పోయార‌ని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు విచార‌ణ చేప‌ట్ట‌లేక పోయార‌ని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ఘ‌న‌త మోదీకి ద‌క్కుతుంద‌న్నారు. దేశంలో ఇవాళ ప్ర‌ధాన స‌మ‌స్య నిరుద్యోగమ‌ని దానిని పూర్తిగా ప‌క్క‌న ఎందుకు పెట్టారో దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌ధానిపై ఉంద‌న్నారు.

దేశంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నా వాటిని ఎందుకు ఉప‌యోగించు కోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో గంప గుత్త‌గా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను వ్యాపార‌స్తుల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఎలా అప్ప‌గిస్తారంటూ ప్ర‌శ్నించారు.

Also Read : Harish Rao : తెలంగాణ కోసం త్యాగం చేసినం

Leave A Reply

Your Email Id will not be published!