Heroin in Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో హెరాయిన్‌ పట్టివేత !

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో భారీగా హెరాయిన్‌ పట్టివేత !

Heroin in Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఆదివారం భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. సౌత్ ఆఫ్రికాలోని జాంబియా నుండి శంషాబాద్ కు వచ్చిన ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి సుమారు రూ. 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌ ను కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాంబియా నుండి హైదరాబాద్(Hyderabad) వస్తున్న లుసాకా అనే మహిళ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో… ఆమె హ్యాండ్ బ్యాగ్ తో పాటు సూట్ కేస్, డాక్యుమెంట్ ఫోల్డర్ లను కష్టమ్స్ అధికారులు విస్తృుతంగా తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో డాక్యుమెంట్‌ ఫోల్డర్‌లో దాచిపెట్టిన 5.92 కిలోల హెరాయిన్‌ ను సీజ్ చేసారు.

Heroin in Shamshabad Airport Viral

హెరాయిన్ అక్రమ రవాణాలకు పాల్పడిన లూకాసాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కష్టమ్స్ అధికారులు మీడియాకు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇటీవల డ్రగ్స్, బంగారం, విదేశీ కరెన్సీ, వజ్రాల అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ప్రపంచం నలుమూల నుండి ఫ్లైట్ కనెక్టివిటీ ఉండటంతో పాటు హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం బాగా పెరడగంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తరచూ మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి.

Also Read : Ayodhya Rammandir from Space: అంతరిక్షం నుండి చూస్తే అయోధ్య రామ మందిరం అదుర్స్ కదూ !

Leave A Reply

Your Email Id will not be published!