Lion Attack in SV Zoo: తిరుపతి జూపార్క్‌ లో వ్యక్తిని చంపేసిన సింహం !

తిరుపతి జూపార్క్‌ లో వ్యక్తిని చంపేసిన సింహం !

Lion Attack in SV Zoo: తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూపార్క్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి సింహం ఎన్ క్లోజర్ లోనికి దూకాడు. ఓ వ్యక్తి తన ఎన్ క్లోజర్ లోనికి వచ్చిన విషయాన్ని గమనించిన సింహం… వెంటనే అతనిపై దాడి చేసి… నోట కరచుకొని ఎత్తుకెళ్లింది. అనంతరం ఆ వ్యక్తి తలభాగం తిని చంపేసింది. దీనితో జూ అధికారుల నుండి సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని… సింహాన్ని ఎన్‌ క్లోజర్‌ కేజ్‌ లో బంధించి… ఎన్ క్లోజర్ నుండి మృతదేహాన్ని వెలికి తీసారు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌ గా గుర్తించారు. ఈ ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్‌ జూ అధికారులను, ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌ క్లోజర్‌లోకి వెళ్లిన ప్రహ్లాద్… భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ క్రింద పడటాన్ని గమనించిన సింహం… ఒక్కసారిగా దాడిచేసి బాధితుడి తల భాగాన్ని పూర్తిగా తినేసినట్లు సమాచారం.

Lion Attack in SV Zoo Viral

ఎస్వీ జూ పార్క్(SV Zoo Park) జరిగిన ఘటపై జూ పార్క్ క్యురేటర్ మీడియాతో మట్లాడుతూ… ‘మధ్యాహ్నం 2.30 గంటలు సమయంలో సింహం ఎన్ క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. జూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసే లోపే ఎన్‌ క్లోజర్‌లోకి వెళ్ళాడు. సింహం ఆ వ్యక్తి మెడ ప్రాంతంలో నోట కరుచుకుని ఎత్తుకు వెళ్ళడంతో మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుల్జార్గా గుర్తించాం. అతను ఒక్కడే జూకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులుకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చాం. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించాం’ అని తెలిపారు.

Also Read : BRS to Congress Jumpings: తెలంగాణాలో జోరందుకుంటున్న రాజకీయ వలసలు !

Leave A Reply

Your Email Id will not be published!