DK Shivakumar: కుమారస్వామి కుటుంబాన్ని రాజకీయ సమాధి చేసేందుకు వంద కోట్ల ఆఫర్ ?

కుమారస్వామి కుటుంబాన్ని రాజకీయ సమాధి చేసేందుకు వంద కోట్ల ఆఫర్ ?

కుమారస్వామి కుటుంబాన్ని రాజకీయ సమాధి చేసేందుకు వంద కోట్ల ఆఫర్ ?

 

సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వెయ్యికి పైగా అమ్మాయిలతో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ, జేడీఎస్ పార్టీలు రాజకీయంగా ఇరకాటంలో పడ్డాయి. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ తండ్రిని సిట్ పోలీసులు అరెస్ట్ చేయగా… ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలు బయటకు రావడం వెనుక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుట్ర ఉందని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది డీకే టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు. వారిద్దరిని టార్గెట్ చేసేందుకు పనిచేస్తే రూ.100 కోట్లు ఇస్తానని చెప్పారని వివరించారు. అడ్వాన్స్‌గా రూ.5 కోట్లు పంపించారని స్పష్టం చేశారు. తాను బౌరింగ్ క్లబ్ రూమ్‌ నంబర్ 110లో ఉన్న సమయంలో ఒకరిని పంపించారని తెలిపారు.

 

కుమారస్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ డ్రైవర్ కార్తీక్ గౌడ నుంచి డీకే శివకుమార్ పెన్ డ్రైవ్ పొందారని దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వివాదం అయ్యేందుకు కారణం శివకుమార్ అని స్పష్టం చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియో వ్యవహారం వైరల్ అయిన ఘటనలో డీకే శివకుమార్‌ సహా ముగ్గురు మంత్రులు ఎన్ చెలువరాయస్వామి, కృష్ణ బైరె గౌడ్, ప్రియాంక్ ఖర్గే పాత్ర ఉందని దేవరాజే గౌడ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ నేత దేవరాజే గౌడ అరోపణలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

 

శివకుమార్ మాట ధిక్కరించినందుకు కక్ష గట్టి కేసు – దేవరాజే గౌడ

 

‘శివకుమార్ చెప్పిన పని చేసేందుకు తాను అంగీకరించకపోయినందుకు తనపై కక్ష గట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారని దేవరాజేగౌడ ఆరోపించారు. అయితే ఆ కేసుకున సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో మరో కేసు పెట్టారన్నారు. లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. డీకే శివకుమార్ రూ.100 కోట్లు ఇస్తాననే డీల్‌కు సంబంధించి ఆడియో రికార్డింగ్స్ నా వద్ద ఉన్నాయి. ఆ ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. స్కాండల్ కేసుకు సంబంధించి సిట్ మీద తనకు నమ్మకం లేదు. సాక్ష్యాధారాలను సీబీఐకి మాత్రం అందజేస్తాను. తన వద్ద ఉన్న వీడియోలు విడుదలైన వాటికి భిన్నంగా ఉన్నాయి అని’ దేవరాజే గౌడ వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!