Sub Register Office: సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు

Sub Register Office: సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఇకపై స్నేహపూర్వకంగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ ముందు ప్రత్యేకం గా పోడియంలు ఉండడంతో ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోందని భావించింది. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రజలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలన్న ఆదేశాలతో జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్లు చర్యలకు ఉపక్రమించారు.

Sub Register Office…

ఈ క్రమంలోనే కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఉన్న పోడియంలు తొలగించే పనులను చేపట్టారు. ఆదివారం సెలవు అయినప్పటికీ కార్యాలయాలకు వచ్చిన సబ్‌ రిజిస్ర్టార్లు రాత్రి వరకు దగ్గరుండి పనులు చేయించారు. వన్‌టౌన్‌లోని టర్నర్‌ చౌల్ర్టీ వద్ద ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు పనులు కొనసాగాయి.

Also Read : Ys Jagan: ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!