Kunal Kamra: పోలీసుల విచారణకు గైర్హాజరైన స్టాండప్ కమెడియన్ కునాల్‌ కామ్రా

పోలీసుల విచారణకు గైర్హాజరైన స్టాండప్ కమెడియన్ కునాల్‌ కామ్రా

Kunal Kamra : ప్రముఖ స్టాండప్ కమెడీయన్ కునాల్ కామ్రా… ముంబైలోని హాబిటాట్ స్టూడియోలో నిర్వహించిన ”నయాభారత్” కామిడీ షోలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను(Eknath Shinde) ”ద్రోహి”గా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనితో కమెడియన్ కామ్రాపై శినసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఆ షో నిర్వహించిన స్టూడియోపై దాడి చేయడంతో పాటు… రాష్ట్రంలో పలు చోట్ల కునాల్ కామ్రాపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో నమోదైన కేసులో… విచారణకు రావాల్సిందిగా సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేసారు. అయితే కమెడియన్ కునాల్ కామ్రా పోలీసుల విచారణకు రాలేదు. దీనితో రెండోసారి కునాల్ కామ్రాకు నోటీసులు జారీ చేసిన ఖర్ పోలీసులు… సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

Kunal Kamra Skip

అయితే రెండో సారి కూడా పోలీసుల విచారణకు స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా(Kunal Kamra) గైర్హాజరయ్యారు. సోమవారం ముంబయిలోని ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు రావాలని సమన్లు పంపినా అతడు రాలేదని పోలీసులు తెలిపారు. అతడికి సమన్లు పంపడం ఇది రెండోసారి అని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిమ్‌ లోని అతడి నివాసం వద్దకు పోలీసులు చేరుకున్నారు. అయితే కునాల్‌ ఇంట్లో ఉన్నారా లేదా అన్నది నిర్ధారించుకోవడానికే అక్కడకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్కడ కుణాల్‌ లేకపోవడంతో చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా పోలీసులు తన కోసం రావడంపై కమెడియన్ కునాల్‌ కామ్రా తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘‘నేను గత పదేళ్లుగా ఆ ఇంట్లో నివసించడం లేదు. ఆ చిరునామాకు వెళ్లడం వల్ల సమయం, ప్రజా వనరులు వృథా కావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కునాల్‌ పేర్కొన్నారు. మరోవైపు అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని స్టాండప్‌ కమెడియన్‌ కుణాల్‌ కామ్రా… మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీనితో మద్రాస్ హైకోర్టు కునాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read : Madhya Pradesh Government: నేటి నుంచి మద్యం షాపుల బంద్ ! ఏ రాష్ట్రంలో అంటే ?

Leave A Reply

Your Email Id will not be published!