MMTS Train: ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్
ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్
MMTS Train : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైలులో(MMTS Train) అత్యాచార ఘటనలో… విచారణ చేపట్టిన పోలీసులకు బిగ్ షాక్ తగిలింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న తనపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించడంతో… రన్నింగ్ ట్రైన్ నుండి దూకి తప్పించుకున్నానని చెప్పిన యువతి మాటలు నమ్మిన పోలీసులకు విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. అసలు ఈ ఘటనలో ఆమెపై అత్యాచారమే జరగలేదని విచారణలో నిర్ధారణ అయ్యింది. రీల్స్ పిచ్చితో… ట్రైన్ లో రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రైన్ నుండి జారిపడిపోయిన ఆమె… దానిని నుండి తప్పించుకోవడానికి ఈ అత్యాచారం నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనితో పోలీసులు ఈ కేసును మూసివేసారు. అయితే యువతి చేసిన పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MMTS Train – అసలు ఏం జరిగిందంటే ?
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి స్విగ్గీలో పనిచేస్తూ మేడ్చల్ లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. మార్చి 22న సెల్‌ఫోర్ రిపేర్ కోసం సికింద్రాబాద్‌కు వచ్చిన యువతి తిరిగి రాత్రి సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో(MMTS Train) ఎక్కింది. సీన్ కట్ చేస్తే… అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా… వారు అక్కడకు చేరుకుని యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా… ఎంఎంటీఎస్ రైలులలో ఒంటరిగా ఉన్న తనపై ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడని… దీనితో భయంతో కదులుతున్న రైలులో నుంచి బయటకు దూకినట్లు చెప్పుకొచ్చింది. యువతి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 250 సీసీటీవీల ఫుటేజ్ ను పరిశీలించి… వంద మంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు.
అయితే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరకు యువతిని ప్రశ్నించగా… తనపై అత్యాచారం జరగలేదని, రీల్స్ చేస్తూ కిందపడ్డాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది యువతి. ఇంట్లో తెలిస్తే మందలిస్తారనమే భయంతో తాను చేసిన పనిని కప్పిపుచ్చుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసినట్లు అంగీకరించింది. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథను అల్లేసి… దానిని చాలా సమర్ధవంతంగా అమలు చేసి పోలీసులను కూడా బురిడీకొట్టించే ప్రయత్నం చేసింది.
Also Read : KTR: కంచ గచ్చిబౌలి భూములపై ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకు కేటీఆర్ విజ్ఞప్తి
