India: భారత్ – పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

భారత్ - పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

India : ఆపరేషన్ సిందూర్ తో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాకిస్తాన్ పై కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. భారత్ – పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకు ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

శనివారం సాయంత్రం భారత(India) విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ… ‘‘మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (DGMO) స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్‌(Pakistan) డీజీఎంఓ భారత డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్రతలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారు’’ అని విదేశాంగ మంత్రి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. దీనితో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.

India – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించినట్లు, కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు.‘ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాము. దీనిలో భాగంగా భారత్‌- పాక్‌లతో రాత్రంతా చర్చలు జరిపాము. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు’ అంటూ పేర్కొన్నారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్‌ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు.

ఉగ్రవాదంపై రాజీపడేది లేదు – జైశంకర్‌

ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్‌, పాక్‌ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

Also Read : PM Narendra Modi: ఉగ్రదాడులపై పాకిస్తాన్ కు భారత్ సీరియస్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!