Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 13మంది మృతి !
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 13మంది మృతి !
Road Accident : ఛత్తీస్‌గఢ్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా… 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్ పూర్ కు వస్తుండగా బలోద బజార్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న ప్యాసింజర్ వాహనాన్ని అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు, నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 30 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు రాయ్‌పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ వెల్లడించారు. ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్‌పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Road Accident – చంద్రగిరి మండలంలో కల్వర్టును ఢీ కోట్టిన ఆర్టీసీ బస్సు
మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం అగరాల పంచాయతీ నారాయణ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువన్నామలై నుండి తిరుపతికి వస్తున్న తిరుమల డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొంది. ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : India: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లు విడుదల
