Vallabhaneni Vamsi: ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వల్లభనేని వంశీ
ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనితో కోర్టు ఆదేశాల మేరకు వంశీను(Vallabhaneni Vamsi) ఇటీవల ఆయుష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
Vallabhaneni Vamsi Health Updates
గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆసుపత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి(Vallabhaneni Vamsi) అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్ సమ్మరీతో సహా సీల్డ్ కవర్‌లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.
Also Read : Heinrich Klaasen : రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా అగ్ర ఆటగాడు ‘క్లాసెన్’