Air India Plane Crash: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎయిరిండియా బాధిత కుటుంబం విజ్ఞప్తి

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎయిరిండియా బాధిత కుటుంబం విజ్ఞప్తి

Air India Plane Crash : అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమాన ప్రమాద (Air India Plane Crash) ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు కాలి బూడిద కావడంతో… తమ వారు ప్రాణాలు కోల్పోయారనే షాక్‌ లో ఉంటూనే…మృతదేహాల కోసం వారి బంధువులు తిండీ నిద్రా లేకుండా ఘటనా స్థలంలో నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు మృతులకు సంబంధించిన ఫొటోలు, పలు వీడియోలను ఉపయోగించుకొని పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుండడంతో విసుగు చెందిన మృతుల కుటుంబసభ్యులు ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Air India Plane Crash Incident

రాజస్థాన్‌ లోని బాంస్‌వాడకు చెందిన డాక్టర్‌ కోమి వ్యాస్‌ భార్యాపిల్లలతో విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబానికి చెందిన ఫేక్‌, ఫొటోలను పలువురు నెటిజన్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారని కోమి వ్యాస్‌ బంధువు కుల్దీప్ భట్ ఆరోపించారు. లైక్స్‌, వ్యూస్‌ కోసం ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా కుటుంబానికి వచ్చిన కష్టంతో ఇప్పటికే మేమంతా మానసికంగా కుంగిపోయి ఉన్నాం. మాలాగే మరో 270కి పైగా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విచారంలో మునిగిపోయి ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు వారి లైక్‌లు, కామెంట్ల కోసం ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు. కోమి కుటుంబం విమానం ఎక్కగానే దిగిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫొటో నుంచి ఏఐ వీడియోలు చేస్తున్నారు.

ప్రమాదంలో మరణించిన వారి కుమార్తె మిరియా (8)కు చెందినదని ఓ మృతదేహం ఫొటోను షేర్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆమెకు దహన సంస్కారాలు చేస్తున్నట్లు మరికొన్ని వీడియోలు కూడా పెడుతున్నారు. చిన్నారి శరీరం పూర్తిగా కాలి బూడిదయ్యిందని వదంతులు సృష్టిస్తున్నారు. కోమి పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి… వారి ఫొటోలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటివరకు వారి మృతదేహాలు కూడా దొరకకపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నాము. లైకుల కోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తూ.. మమ్మల్ని మరింత క్షోభకు గురిచేయకండి’’ అని విజ్ఞప్తి చేశారు.

గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్‌ (Ahmedabad) నుంచి లండన్‌ (London) బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోవడంతో మొత్తం 274 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో లండన్ లో స్థిరపడటానికి కుటుంబ సమేతంగా బయలు దేరిన రాజస్థాన్‌ కు చెందిన డాక్టర్‌ కోమి వ్యాస్‌ కుటుంబం మృతి చెందింది. డాక్టర్ కోమి వ్యాస్, ఆమె భర్త ముగ్గురు పిల్లలు కూడా అగ్నికి ఆహుతయ్యారు.

Also Read : PM Narendra Modi: ప్రధాని మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

Leave A Reply

Your Email Id will not be published!