Son: కన్నతల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కుమారుడు

కన్నతల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కుమారుడు

Son : వరంగల్‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడే (Son) కన్నతల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కుంటుపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సతీశ్‌ తన తల్లి వినోద(60)తో శనివారం తెల్లవారుజామున డబ్బు విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం తల్లి అరుపులు విని గోడదూకి పారిపోయాడు. స్థానికులు మంటలార్పి బాధితురాలిని వరంగల్‌లోని (Warangal) ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. స్థానిక ఎస్సై నరేశ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Son – మహిళను వివస్త్రను చేసి చిత్రవధ

జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన వెలుగు చూసింది. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను ఇనుప గ్రిల్స్ కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురి చేశారు. తప్పు చేశామని క్షమించాలని వేడుకున్నా కూడా వినకుండా దాడి చేశారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు… మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పదిరోజుల క్రితం ఇద్దరు కలిసి గ్రామం నుంచి పారిపోయారు. వీరిద్దరి కోసం గాలించిన రాజు కుటుంబసభ్యులు ఎట్టకేలకు వారిని వెతికి పట్టుకుని తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. ఆపై మహిళ పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. ఆమెను ఇనుప గ్రిల్స్‌కు కట్టి వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి దారుణంగా చిత్రవధ చేశారు. తరువాత ఇద్దరికీ గుండు గీయించారు.

ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన అనంతరం రాజు, మహిళ కనిపించకుండా పోయారు. మహిళపై దాడి దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ధర్మసాగర్ పోలీసులు తాటికాయల గ్రామానికి చేరుకుని దాడిలో పాల్గొన్న కుటుంబసభ్యుల వివరాలను సేకరించారు. మహిళను చిత్ర హింసలకు గురిచేసిన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కనిపించకుండా పోయిన రాజు, మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : Anchor Swetcha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

Leave A Reply

Your Email Id will not be published!