Gangster: యువకుడి కొంప ముంచిన గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్

యువకుడి కొంప ముంచిన గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్

Gangster : గ్యాంగ్ లీడర్ భార్యతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి కొంపముంచింది. ఆమె మరణం ఆ వ్యక్తి చావుకు వచ్చింది. నాగపూర్ లో 40 మంది ఉన్న ఆ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ … ఇప్పుడు అతని కోసం వెంటాడుతోంది. దీనితో ఆ వ్యక్తి ప్రాణ భయంతో ఆ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Gangster Hulchal

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు (Nagpur) చెందిన ఇప్ప గ్యాంగ్‌కు పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌గా పేరుంది. ఆర్షద్ టోపి అనే వ్యక్తి ఆ గ్యాంగులో సభ్యుడిగా ఉన్నాడు. అతడు ఏకంగా ఆ గ్యాంగ్ లీడర్ భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. బయట తిరుగుతూ ఉండేవారు. గురువారం ఇద్దరూ బైకు మీద బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారు ప్రయాణిస్తున్న బైకు యాక్సిడెంట్‌కు గురైంది. గ్యాంగ్ లీడర్ (Gangster) భార్య తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అర్షద్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. భార్య చనిపోవటంతో ఇప్ప గ్యాంగ్ లీడర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన భార్యకు, అర్షద్‌కు సంబంధం ఉందని తెలియటంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

తన భార్య చావుకు అర్షద్ కారణమని గ్యాంగ్ లీడర్ (Gangster) భావించాడు. అతడ్ని చంపి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ మొత్తం అర్షద్‌ కు వ్యతిరేకంగా మారింది. అతడ్ని వెతికిపట్టుకుని చంపాలని డిసైడ్ అయింది. ఇప్ప గ్యాంగ్ అర్షద్ కోసం గాలిస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియటంతో అర్షద్ డీసీపీ ఆఫీస్‌కు వెళ్లాడు. పోలీసులు అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పోలీసులను కలిసిన తర్వాత అర్షద్ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్ప గ్యాంగ్ అతడ్ని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

నాగ్‌పూర్ (Nagpur) సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అర్షద్ టోపీతో పాటు ఆ మహిళ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వారి వాహనం జేసీబీని ఢీకొంది. అర్షద్ టోపీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. కోరాడి థర్మల్ ప్లాంట్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో, ఆమెను కాంప్టీలోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు చికిత్స అందించేందుకు నిరాకరించారు.

ఎట్టకేలకు ఆమెను అర్షద్ టోపీ నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ వార్త తెలియగానే ఇప్పా గ్యాంగ్ సభ్యులు అర్షద్ టోపీని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ముఠా నాయకుని భార్యను అర్షద్ టోపీని హత్య చేసివుండవచ్చని ఇప్పా గ్యాంగ్ సభ్యులు భావిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన అర్షద్ టోపీ పార్డిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కార్యాలయానికి రక్షణ కోరుతూ వెళ్లాడు.

పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డీఎస్‌పీ అతనిని కొరాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఆ మహిళ ప్రమాదంలో మరణించిందా? లేక హత్యకు గురైందా అనేదానిపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Also Read : Raj Thackeray: 20 ఏళ్ల తరువాత ఒక్కటైన ఠాక్రే సోదరులు

Leave A Reply

Your Email Id will not be published!