Train Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం ! స్కూల్‌వ్యాన్‌ను ఢీ కొన్న రైలు !

తమిళనాడులో ఘోర ప్రమాదం ! స్కూల్‌వ్యాన్‌ను ఢీ కొన్న రైలు !

Train Accident : తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో మంగళవారం ఉదయం ఓ స్కూల్‌ వ్యాన్‌ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. రైలు వెళ్లే సమయానికి గేటు వేయకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

Train Accident in Tamil Nadu

దీనితో అప్రమత్తమైన స్థానికులు ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటినా రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, గేట్‌మెన్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం ధాటికి వ్యాన్‌ తునాతునకలైన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే గేట్ కీపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Also Read : Supreme Court: బిహార్‌లో ఓటరు జాబితా సవరణపై ఈ నెల 10న సుప్రీం విచారణ

Leave A Reply

Your Email Id will not be published!