Muralidhar Rao: నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అరెస్ట్‌

నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అరెస్ట్‌

Muralidhar Rao : అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో తెలంగాణా నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్‌రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల నిర్వహించిన ఈ తనిఖీల్లో వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు.

Muralidhar Rao Arrest

హైదరాబాద్ (Hyderabad) శివారులో 11 ఎకరాల భూమి, నాలుగు ఇళ్ల స్థలాలు, మోకిలలో 6,500గజాల స్థలం గుర్తించారు. కొండాపూర్‌లో విల్లా.. బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్‌లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లను గుర్తించారు.

మురళీధర్‌రావు (Muralidhar Rao) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మురళీధర్ రావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులు, విలువైన వస్తువులు మురళీధర్ రావు పేరిట ఉన్నట్లు గుర్తించారు. కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్‌ గూడ, బేగంపేట, కోకాపేట్‌లలో ఆయనకు పలు ప్లాట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కరీంనగర్, హైదరాబాద్‌ నగరాల్లో కమర్షియల్ బిల్డింగులు.. అదే విధంగా కోడాడలో అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2 కిలో వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో మరో అపార్ట్‌మెంట్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు తమ సోదాల్లో కనుగోన్నారు.

వీటితోపాటు 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో నాలుగు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6,500 చదరపు గజాల భూమి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అదే విధంగా మూడు కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సైతం ఈ సోదాల్లో బయటపడ్డాయి. ఇవన్నీ అధికారిక హోదాను దుర్వినియోగం చేయడం ద్వారా మురళీధర్ సంపాదించిన ఆస్తులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలు పూర్తయిన అనంతరం రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.

Also Read : Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష అమలు వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!