Family: తిరుపతిలో ఘోర విషాదం ! బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య !
తిరుపతిలో ఘోర విషాదం ! బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య !
Family : తిరుపతి జిల్లాలో ఘోర విషాద ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు నలుగురు ఒకేసారి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా బావిలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే నలుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
Family Suicide in Tirupati
ఈ ఘటనలో తల్లి హేమలత, చిన్న పాప తేజశ్రీ మృతదేహాలను బయటకు తెచ్చారు స్థానికులు. తండ్రి గిరి కొనఊపిరితో ఉండగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పెద్ద కూతురు తనుశ్రీ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : CM Chandrababu Naidu: హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
