KTR: డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం – కేటీఆర్‌

డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం - కేటీఆర్‌

KTR: జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. జైపుర్‌ లో జరుగుతున్న టాక్‌ జర్నలిజం 9వ ఎడిషన్‌ చర్చా కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని… ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయన్నారు.

KTR Key Comments

బిహార్‌ లో జరుగుతున్న ఎన్నికల ప్రత్యేక ఓటర్ల సవరణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఈసీఐ ఏం చేస్తోంది? దేశంలోని మిగతా రాష్ట్రాల పైన దీని ప్రభావం ఉంటుంది అని కేటీఆర్ అన్నారు. 1948లో 26 శాతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల జనాభా 19 శాతానికి తగ్గింది. ఉత్తరాదిలో సరిగ్గా కుటుంబ నియంత్రణ అమలు చేయకపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో 1950 నుంచి ఇప్పటి వరకు 239 శాతం జనాభా పెరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తోంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Also Read : Tribals: పోలీసులపై పోడు రైతుల రాళ్ల దాడి

Leave A Reply

Your Email Id will not be published!