Vigilance: ఒడిశా అటవీశాఖ అధికారి ఇంట్లో భారీగా బంగారం, నోట్ల కట్టలు
ఒడిశా అటవీశాఖ అధికారి ఇంట్లో భారీగా బంగారం, నోట్ల కట్టలు
Vigilance : అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Vigilance Officer Seiz
శుక్రవారం ఉదయం రామచంద్ర నేపక్ అనే అటవీశాఖ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు భారీగా నగదుతోపాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో జయపూర్ లోని ఆయన ఫ్లాట్‌లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్‌లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.
రామచంద్ర గతంలో జైపుర్ ఫారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు నిర్వర్తించే వారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో… ఒడిశా (Odisha), జైపుర్‌లో ఆరు చోట్ల ఏక కాలంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపుర్ లో అతడు నివాసం ఉన్న అపార్ట్మెంట్లో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడుతుండటంతో… లెక్కించేందుకు ప్రత్యేకంగా కరెన్సీ కౌంటింగ్ మెషీన్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆయన నివాసంతోపాటు, ఆయన పని చేసిన కార్యాలయం, అత్తవారిల్లు, భువనేశ్వర్‌లోని ఆయన సోదరుడి ఇంట్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాలుగు రోజుల క్రితం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్న నిత్యానంద నాయక్ అనే అధికారి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా… 115 ప్లాట్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. నాయక్ పేరుతో 53 ప్లాట్లు, ఆయన భార్య పేరుపై 42, ఇద్దరు కుమారులపై 16, కుమార్తె పేరు మీద మరో నాలుగు ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. తాజాగా ఒడిశా (Odisha) కు చెందిన మరో అధికారి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు, బంగారం బయటపడటం మరోసారి చర్చనీయాంశమైంది.
Also Read : KTR: సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
