KTR : బీసీ రిజర్వేషన్ అంశంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ రాసిన లేఖలో ఏముందో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. కనీసం లేఖ చదివే తెలివి సైతం ఆయనకు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
KTR Slams CM Revanth Reddy
‘కనీసం లెటర్ చదివే తెలివిలేదు సీఎం రేవంత్‌కు. సోనియా లెటర్‌లో ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసి పొయిండు. సోనియా గాంధీ తనకు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని… కానీ చదువు రాక రేవంత్ రెడ్డి పరవశించి పోతున్నాడు. రేవంత్ కార్యక్రమాని రాలేకపోతున్న అని సోనియా రాసిన లేఖలో ఒక్క మాటకూడా రేవంత్ పై ప్రశంసనే లేదు. కార్యక్రమానికి రాలేను అన్న సోనియా మాటలే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అని చెప్పుకుంటున్నారు. రేవంత్‌ను చూస్తూ జాలేస్తుంది’ అని కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకుందంటున్న డిగ్రీ సర్టిఫికేట్… దొంగ డిగ్రీనేమో అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కుల గణన అంశంపై జులై 24వ తేదీ అంటే… గురువారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ, లోక్ సభ ఎంపీలతోపాటు ఆ పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అగ్రనేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ హాజరు కాలేదు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రత్యేకంగా లేఖ రాశారు. తనకు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ స్వయంగా లేఖ రాయడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ లేఖ తనకు నోబెల్ అవార్డుతో సమానమన్నారు. అలాగే ఈ లేఖ ఆస్కార్ అవార్డుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైవిధంగా స్పందించారు.
మిత్తి సహా చెల్లిస్తాం
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమపై విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అడిగితే డైవర్షన్ చేయడానికి అనవసరపు మాటలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసుల్ని హెచ్చరించారు. ఈసారి ఎవ్వడు అడ్డుకున్న కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read : CM Devendra Fadnavis: మంత్రివర్గ పునర్వవస్థీకరణకు కసరత్తు – ఢిల్లీకి మహారాష్ట్ర సీఎం
