Pune Rave Party: పుణేలో రేవ్ పార్టీపై పోలీసుల దాడులు ! మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు అరెస్టు !
పుణేలో రేవ్ పార్టీపై పోలీసుల దాడులు ! మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు అరెస్టు !
Pune Rave Party : పుణెలో ఓ అపార్టుమెంట్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై (Pune Rave Party) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నార్కొటిక్స్, హుక్కా సెటప్‌తో పాటు లిక్కర్ ను సీజ్ చేసి ఏడుగురు నిందితులని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు నిందితులను కోర్టులో హాజరు పరచగా… ఈ నెల 29వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ఎన్సీపీ (శరద్‌పవార్) నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే స్పందించారు. పోలీసుల దాడులు రాజకీయ ప్రేరేపితమై ఉండొచ్చని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రాంజల్ ఖేవాల్కర్ సతీమణి రోహిణి ఖడ్సే ప్రస్తుతం ఎన్సీపీ (ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
Pune Rave Party Sensational
మహారాష్ట్రలోని పుణెలో (Pune) ఖరాడి ప్రాంతంలోని స్టుడియో అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో క్రైం పోలీసులు దాడులు చేసినట్లు డీసీపీ నిఖిల్ పింగలే మీడియాకు వెల్లడించారు. ఈ దాడుల్లో 2.7 గ్రాముల కొకైన్‌లాంటి పదార్థం, 70 గ్రాముల గంజాయిలాంటి పదార్థాలతో పాటు హుక్కా పాట్, లిక్కర్, బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశామని… అరెస్టయిన వారిలో ప్రాంజల్ ఖేవాల్కర్‌తో పాటు నిఖిల్ పోప్టానీ, సమీర్ సయ్యద్, శ్రీపాద్ యాదవ్, సచిన్ భోంబే, ఈషా సింగ్, ప్రాచీ శర్మ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరందరిపైనా మాదకద్రవ్యాల నిరోధక చట్టంలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేఅఆమన్నారు. నిందితులను వైద్య పరీక్షల కోసం తరలించామని.. ఇంకా నివేదికలు రావాల్సి ఉందన్నారు.
రేవ్ పార్టీ ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్
ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పుర్ లో స్పందించారు. ‘‘ఈ విషయం గురించి నేను మీడియాలోనే చూశాను. ఉదయం నుంచి నేను వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నేనూ ఈ విషయాన్ని మీడియాలోనే చూశాను. ఉదయం నుంచి వేర్వేరు కార్యక్రమాలకు హాజరవుతున్నా. అందువల్ల దీని గురించి నాకు అసలు సమాచారం తెలియదు. మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే… పోలీసులు ఒక రేవ్ పార్టీని ఛేదించారు. అక్కడ కొందరు పట్టుబడ్డారు. డ్రగ్స్ కూడా దొరికాయని సమాచారం. వివరాలు అందిన తర్వాతే దీనిపై మాట్లాడగలను. ప్రాథమికంగా చూస్తే ఆ ప్రదేశంలో నేరం జరిగినట్లు కనబడుతోంది’’ అని తెలిపారు.
Also Read : CM Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుంది – సీఎం చంద్రబాబు
