BSF: చొరబాటుదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు BSFకు బాడీ కెమెరాలు

చొరబాటుదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు BSFకు బాడీ కెమెరాలు

BSF : దేశంలోకి వచ్చిన అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపించే క్రమంలో సాయుధ బలగాలపైనే తిరగబడుతూ దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న సరిహద్దు బలగాలు… ఇటువంటి ఘటనలను ఆధారాలతో సహా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దులోని బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు 5వేలకు పైగా శరీరానికి ధరించే కెమెరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

BSF – Body Cameras

వీటితోపాటు ఎంపిక చేసిన సరిహద్దు ఔట్‌ పోస్టుల్లోని సిబ్బందికి ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్‌ స్కాన్‌ వంటి బయోమెట్రిక్‌ పరికరాలను అందించనున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటుదారుల నుంచి సేకరించిన ఈ సమాచారాన్ని ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌ఎఫ్‌ ప్రతిపాదించిన ఈ రెండు విధానపర నిర్ణయాలపై సమగ్ర సమీక్ష అనంతరం కేంద్ర హోంశాఖ ఇటీవల ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా రెండు దశల్లో వీటిని భారత్‌-బంగ్లా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్‌ఎఫ్‌కు అందజేస్తున్నట్లు తెలిసింది. రాత్రిపూట చిత్రీకరణ, 12-14 గంటల ఫుటేజీ నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం ఈ కెమెరాలకు ఉన్నట్లు తెలిసింది.

Also Read : Pune Rave Party: పుణేలో రేవ్‌ పార్టీపై పోలీసుల దాడులు ! మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే అల్లుడు అరెస్టు !

Leave A Reply

Your Email Id will not be published!