Supreme Court: బిహార్ లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలివ్వండి – సుప్రీంకోర్టు
బిహార్ లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలివ్వండి - సుప్రీంకోర్టు
Supreme Court : బిహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఈ నెల 9వ తేదీలోగా అందజేయాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. బిహార్ లో ఎస్‌ఐఆర్ చేపట్టాలని జూన్ 24న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. దీనితో ఇప్పటికే రాజకీయ పార్టీలతో పంచుకున్న ఆ సమాచారాన్ని పిటిషనర్ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థకు కూడా ఇవ్వాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. బిహార్‌లో చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్)ను ఏడీఆర్ సవాల్ చేసింది. తాజాగా.. ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను, అందుకుగల కారణాలను (మృతి, వలసపోవడం లేదా మరేదైనా) వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ నెల ఒకటిన విడుదలైంది ముసాయిదా జాబితానే కనుక తొలగింపు కారణాలను ఆ తర్వాత క్రమంలో వెల్లడిస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు ధర్మాసనం తెలిపింది. సవరణ ప్రకియలో భాగంగా ఓటరు నమోదు పత్రాన్ని పూరించి అందజేసిన 75శాతం మంది ఓటర్లలో చాలా మంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేయలేదని, బూత్ స్థాయి అధికారుల సిఫార్సుతో ముసాయిదా జాబితాలో వారి పేర్లను చేర్చారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prasanth Bhushan) ఆరోపించారు. ప్రధాన పిటిషన్లపై ఈ నెల 12న జరిగే విచారణ సమయంలో ఈ విషయాలను తెలియజేయవచ్చని న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.
పిటిషన్ దాఖలు చేసింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. వారు మరణించారా? లేక వలస వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియజేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం అందజేయాలని, ఒక కాపీని ఏడీఆర్‌కు ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించింది.
Supreme Court – అనాథ పిల్లల్లో ఎంతమందికి విద్యను నిరాకరించారు – సుప్రీంకోర్టు (Supreme Court)
అనాథ పిల్లలకు విద్యపై సుప్రీం కోర్టు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009 కింద ఎంతమందికి చదువును నిరాకరించారో సర్వే చేసి గుర్తించాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వచ్చే జనాభా లెక్కల్లో అనాథలను కూడా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. అనాథల సంరక్షణ, రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంత మం ది అనాథ పిల్లలకు అడ్మిషన్లు కల్పించారు, అలాగే ఎంతమందికి నిరాకరించారు.. దానికి గల కారణాలేమిటి అనే దానిపై సర్వే చేయాలని రాష్ట్రాలకు ధర్మాసనం నిర్దేశించింది.
సర్వే సందర్భంగా అర్హులైన పిల్లలను గుర్తిస్తే సమీప పాఠశాలల్లో చేర్చాలని చెప్పింది. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు 4 వారాల గడువు ఇచ్చింది. పాఠశాలల్లో బలహీనవర్గాలకు కేటాయించిన 25 శాతం కోటా సీట్లలో అనాథ పిల్లలకు కూడా స్థానం కల్పించాలంటూ నోటిఫికేషన్ జారీ చేసిన గుజరాత్, ఢిల్లీ, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాలను ప్రస్తావి స్తూ.. అలాంటి నోటిఫికేషన్ ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. వచ్చే జనాభా లెక్కల్లో అనాథలకు కూడా చోటు కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విచారణ సందర్భంగా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. జనాభా లెక్కల సందర్భంగా అనాథల కోసం కూడా ప్రత్యేక బాక్స్ ఉండాలని, అప్పుడు వారి డేటాను సులువుగా పొందవచ్చని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పే అధికారిక డేటా కూడా లేదన్నారు. యునిసెఫ్ లెక్కల ప్రకారం 2.5 కోట్ల మంది ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
Also Read : Uttarakhand: ప్రతికూల వాతావరణంలో కూడా ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న అన్వేషణ
