Minister Venkat Reddy: కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారు – మంత్రి వెంకట్ రెడ్డి

కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారు - మంత్రి వెంకట్ రెడ్డి

Minister Venkat Reddy : ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం తన మీద కోపం SLBC మీద చూపిస్తుందని ఆరోపించారు. SLBC కూలిపోవాలని కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 43 కిలోమీటర్లు ఉన్న SLBC టన్నెల్ ఓ అద్భుతమని తెలిపారు.

Minister Venkat Reddy Key Comments

మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక రావడంతో… బీఆర్ఎస్ నాయకులు నోళ్లు మెదపడం లేదని పేర్కొన్నారు. నివేదికతో బీఆర్ఎస్ బాగోతం బట్టబయలైందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ నాయకులు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై నమ్మకంతోనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి వివరించారు.

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గురువును మించిన శిష్యుడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Venkat Reddy) అన్నారు. జగదీష్ రెడ్డి ఇంటర్నేషనల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్లు ఎవరు ఇస్తే వాళ్ళ వెంట తిరిగేవారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌల్‌లో ఎకరం రూ.50 లక్షలు ఉంటే… జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్‌ లో ఎకరం రూ.40 కోట్లు ఉంటుందని చెప్పుకొచ్చారు.

జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క ఉటుందని మంత్రి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవనీతిపై విచారణ చేపిస్తున్నామని బాంబు పేల్చారు. కేసీఆర్ కంటే ఎక్కువ జగదీష్ రెడ్డి సంపాదించారని దుయ్యబట్టారు. త్వరలో అవినీతికి పాల్పడిన నాయకులు చిట్టా బయటకు తీస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన నాయకులు తప్పకుండా.. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ అరెస్ట్‌ ఖాయం – మంత్రి వెంకట్ రెడ్డి

అనంతరం కేసీఆర్ అరెస్ట్‌పై వెంకట్ రెడ్డి సెటైరికల్‌గా స్పందించారు. సినిమాల్లో విలన్ల అరెస్టు క్లైమాక్స్ వరకు జరగదని తెలిపారు. విలన్లు ఫైనల్లోనే.. అరెస్ట్ అవుతారని గుర్తుచేశారు. అరెస్ట్ అనేది తమ పనికాదని.. పోలీసులు చూసుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి తెలిస్తే గుండె పలిగి చనిపోతారని విమర్శించారు. కాళేశ్వరం నివేదికతో కేసీఆర్ అస్సలు రంగు బయటపడిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేమని కానీ అరెస్ట్ మాత్రం ఖాయమని మంత్రి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!