Supreme Court: దిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదు – సుప్రీం కోర్టు

దిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదు - సుప్రీం కోర్టు

Supreme Court : దిల్లీ, NCR (National Capital Region) లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్‌ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ… ఈ ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

వీధి కుక్కల దాడుల వల్ల దిల్లీ, ఎన్సీఆర్‌ల పరిధిలో రేబిస్‌ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం (Supreme Court) ఈ విషయంపై విచారణ కొనసాగిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని.. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం (Supreme Court) పేర్కొంది. వీలైనంత త్వరగా దిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించింది.

వీధికుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్దివాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరగా.. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో ఆ పనులు నిలిచిపోయాయని న్యాయస్థానానికి వివరించారు. దీనితో ఆగ్రహించిన జస్టిస్ పార్దివాలా ‘ఆ జంతు ప్రేమికులందరూ కలిసి రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలుతారా?’ అని ప్రశ్నించారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని అన్నారు. కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

Supreme Court – పిల్లికి ఇంటి ధృవీకరణ పత్రం ? నవ్వులు పూయిస్తున్న దరఖాస్తు !

బీహార్ రాష్ట్రం మరోసారి విచిత్రమైన ఘటనతో వార్తల్లో నిలిచింది. రోహ్తాస్ జిల్లాలో ‘క్యాట్‌ కుమార్‌’ అనే పేరుతో ఒక పిల్లికి నివాస ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. ఈ దరఖాస్తులో తండ్రి పేరు క్యాటీ బాస్‌,తల్లిపేరు కటియా దేవిగా పేర్కొనడం గమనార్హం.

జూలై 29 రోహ్తాస్ జిల్లా నస్రిగంజ్ బ్లాక్ అటిమిగంజ్ గ్రామ నివాసి రైట్‌ టూ పబ్లిక్‌ సర్వీస్‌ డొమైన్‌ లో తన పిల్లికి ఇంటి సర్టిఫికెట్‌ కావాలని ధరఖాస్తు చేశారు. ధరఖాస్తులో పిల్లి ఫోటో, ఇమెయిల్, ఫోన్ నంబర్ వివరాలు సైతం వెల్లడించారు. దీనితో జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ ఆదేశాల మేరకు నస్రిగంజ్ రెవెన్యూ అధికారి కౌశల్ పటేల్ కేసు నమోదు చేశారు. నస్రిగంజ్ పోలీస్ స్టేషన్‌లో తన పిల్లికి ఇంటి అడ్రస్‌ కోసం హౌస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని ఆర్‌టీపీఎస్‌ డొమైన్‌లో అప్లయి చేసుకున్న అజ్ఞాత వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, ఈ దరఖాస్తును ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేయడానికి చేసిన ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘డాగ్ బాబు’, ‘డాగేష్ బాబు‌’ పేరుతో నివాస ధృవీకరణ పత్రాల కోసం ధరఖాస్తు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది.

Also Read : Rahul Gandhi: రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!