Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్‌ రాయబారి కౌంటర్‌

ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్‌ రాయబారి కౌంటర్‌

Priyanka Gandhi: గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే వేలాది మంది మరణానికి కారణమైందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలను భారత్‌ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌ తీవ్రంగా ఖండించారు. గాజాలోని వేలాది మంది హమాస్‌ ఉగ్రవాదులనే తాము చంపామని బదులిచ్చారు.

Priyanka Gandhi Key Comments

గాజాలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ప్రియాంక (Priyanka Gandhi)… ‘‘ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోంది. 60 వేల మందిని హత్య చేసింది. వారిలో 18,430 మంది చిన్నారులు, పిల్లలు సహా అనేక మంది ఆకలితో చనిపోయారు’’ అని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచం మౌనంగా ఉండటాన్ని ఖండించిన ఆమె… ఇలా ఉండటం కూడా నేరమేనంటూ భారత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.

అయితే ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ స్పందించారు. ‘‘మీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి. 25వేల మంది హమాస్‌ ఉగ్రవాదులను ఇజ్రాయెల్‌ చంపింది. సామాన్యుల వెనుక దాక్కొని హమాస్‌ హేయమైన వ్యూహాలకు పాల్పడుతుండటం వల్ల ప్రాణనష్టం మరింత పెరుగుతోంది’’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ 20లక్షల టన్నుల ఆహార పదార్థాలను గాజాలోకి పంపించిందని, హమాస్‌ మాత్రం వారిని నిర్బంధిస్తోందని ఆరోపించారు. ఇదే అక్కడ ఆకలికి కారణమవుతోందన్నారు. గాజాలో మారణహోమం లేదని, గడిచిన 50 ఏళ్లలో అక్కడి జనాభా 450 శాతం పెరిగిందన్నారు.

Also Read : Air India: విమానం దారి మళ్ళించిన ఘటనపై స్పీకర్‌ కు ఎంపీల ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!