IMD: కోస్తాంధ్ర, యానాంకు ఆకస్మిక వరద ముప్పు ?

కోస్తాంధ్ర, యానాంకు ఆకస్మిక వరద ముప్పు ?

IMD : అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్‌ ఫ్లడ్‌) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ చేసింది. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు హై ఎలర్ట్ జారీ చేసారు.

IMD Shocking Comments

మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని విశాఖ వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్‌ కుమార్ తెలిపారు. పశ్చిమ మధ్య – వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం… పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర -ఒడిశా (Odisha) వైపు కదిలే అవకాశముందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు చెప్పారు. గడచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు.

పశ్చిమమధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట్లు, నాటు పడవలపై నదిలో ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Also Read : Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

Leave A Reply

Your Email Id will not be published!