Jeep Wagoneer: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా భూటాన్ రాజు కారు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా భూటాన్ రాజు కారు
Jeep Wagoneer : దిల్లీలోని ఎర్రకోట వేదికగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఓ పాత కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో ఆ కారు విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధానికి గుర్తుగా ఉన్న జీప్ వేగనీర్ (Jeep Wagoneer) అనే ఈ కారు ను భూటాన్ రాజు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ జీప్ వేగనీర్ 1965లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణకు… భూటాన్ రాజు బహుమతిగా ఇచ్చారు. అప్పటినుంచి రెండు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఉన్న ఈ కారు… భారత్ కు అత్యంత విలువైన కానుకల్లో ఒకటి. 2000లో దీన్ని అధికారికంగా సైన్యానికి అప్పగించారు. అప్పటినుంచి ఇది న్యూదిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం జనరల్ ఆఫీస్ కమాండింగ్ (జీఓసీ)కు ఈ కారు సేవలందిస్తుంది.
ఈ కారు ప్రతీఏటా ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఇది పాల్గొంటుంది. అత్యాధునిక వాహనాల మధ్య… ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బలమైన దౌత్య సంబంధాల వారధిగా నిలుస్తుంది. 1962-1991 మధ్యలో ఈ జీప్ వేగనీర్లను తయారుచేశారు. అప్పట్లో దీన్ని ‘స్టేషన్ వాగన్’గా పిలిచేవారు.
Jeep Wagoneer – చరిత్ర సృష్టించిన బ్రాండ్
ఈ వేగనార్ కారు అమెరికాకు చెందిన జీప్ కంపెనీది. 1963లో వేగనార్ కార్ల ప్రొడక్షన్ మొదలైంది. దాదాపు 29 ఏళ్ల పాటు వేగనార్ కార్ల ఉత్పత్తి జరిగింది. వేగనార్ కార్లు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అమెరికా ఆటోమొబైల్ చరిత్రలో ఈ కార్లకంటూ ఓ చరిత్ర ఉంది. బాడీ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా ఎక్కువ కాలం ఉత్పత్తి చేయబడిన ఎస్‌యూవీలు వేగనార్ కార్లే కావటం విశేషం. 1991లో వీటి ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే, 2021లో మోడ్రన్ వర్షన్ వేగనార్ కార్లు అందుబాటులోకి వచ్చాయి.
Also Read : CM MK Stalin: రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కాలరాస్తోంది – స్టాలిన్
